28, మార్చి 2010, ఆదివారం

నన్ను క్షమించొద్దు

నన్ను క్షమించొద్దు ప్లీజ్
నా చిట్టి తల్లీ
నిమిషంలోనే
నా మనసంతా ఆక్రమించావు
తామరాకుల్లాంటి
బుజ్జి బుజ్జి పాదాలతో
ఎగసి పడే తరంగాలతో
నా పొట్టలో నువ్వు చేసే
అల్లరి
నా ఉహల్లోకి రాకముందే
నిన్ను భ్రూణ హత్య చేశాను
నా కళల కంటి పాపా
నీ తల్లి నిర్దయరాలేనమ్మా
నన్నెందుకు మొగ్గలోనే త్రున్చేసావమ్మా
అని ప్రశ్నించకుతల్లీ !
నీ కోసం ప్రపంచాన్ని ఎదిరించాలనే ఉంది
నీ కోసం దూరంగా పారిపోవాలనే ఉంది
కాని నిస్సహారాలుని
నా చుట్టూ ఉన్న
అందరి ప్రేమ రాహిత్యంతో
అందరూ ఉండీ
లేనిదానిలా
నిన్నో ఇర్భాగ్యురాల్ని చేయలేను
నా కేప్పటికీ నీ మీద ప్రేమే తప్ప
ద్వేషం రానే రాదు
ప్లీజ్ ....నీ బుజ్జి కాళ్ళ తో
నా గుండెని తన్నోడ్డు

అమ్మా...అమ్మా అంటూ నా చెవిలో
గుస గుస లాడవద్దు
నా మీద నాకే పెరిగిన కోపాన్నీ ద్వేషాన్నీ
తగ్గించ వద్దు
నన్ను క్షమించవద్దు


పెరుగు sujanaaraamam

Reply
Forward
Reply by chat to Madhav
M.Madhava Reddy
సుజన గారూ ! 'Letter to a child never born' అని ఓ పుస్తకం వుంది . మీరు చదివారో...
Mar 26 (3 days ago)
PERUGU SUJANA
శుభోదయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి